అస్సాం రాజధాని దిబ్రూగఢ్‌లో ఓ కూతురికి తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఓ రోజు వారి ఇంటికి అబ్బాయి వచ్చి అమ్మాయి చూసుకున్నాడు. అతడికి అమ్మాయి నచ్చడంతో.. పెళ్లి చేసుకుంటానని చెప్దామనుకున్నాడు. ఇంతలోనే అతడిని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగా.. అందులో ఎదురుగా ఉన్న అమ్మాయి నగ్న ఫొటో ఉంది. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ విషయం అమ్మాయికి కూడా తెలిసి పోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేసన్‌కు వెళ్లిన ఆమె.. తన కజిన్‌తో పాటు మరో ఇద్దరు తనపై గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల కిందట ఆమె తన కజిన్‌తో కలిసి చదువుకోవడానికి కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలోనే ఓ రోజు కళాశాలకు వెళ్తుండగా టెక్నికల్ ఇష్యూతో బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది.
దీంతో కజిన్ వాళ్ల దగ్గరి బంధువుకు ఫోన్ చేసి బైక్ పాడైపోయిందని చెప్పాడు. దీంతో అతడు కారు తీసుకోని రాగా.. ముగ్గురు కలిసి కారులో ఉన్న సమయంలో ఆమెకు కూల్‌డ్రింక్ తాగించారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమె కళ్లు తెరిచి చూసే ఒక రూమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే బయటకు వచ్చి చూడగా.. తన కజిన్, వాళ్ల దగ్గరి బంధువు, మరో వ్యక్తి ఉన్నారు. స్పృహ లేకపోవడంతో తనపై జరిగిన దారుణం ఆమెకు తెలియలేదు. తనకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. అదే సమయంలో తన నగ్న ఫొటోలు తీశారని సదరు ఆమ్మాయి అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఫొటోలతో కొందరు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆమ్మాయి కజిన్‌ను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.