గేట్లు తెరవడంలో ఆలస్యం.. సెక్యూరిటీ గార్డును కొట్టిన మహిళ.. ఆ తర్వాత

Noida woman arrested after her video of abusing, assaulting guards goes viral. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఓ సొసైటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ

By Medi Samrat
Published on : 21 Aug 2022 6:55 PM IST

గేట్లు తెరవడంలో ఆలస్యం.. సెక్యూరిటీ గార్డును కొట్టిన మహిళ.. ఆ తర్వాత

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఓ సొసైటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ ఉండడం కెమెరాకు చిక్కింది. మహిళ సంపన్న కుటుంబానికి చెందినట్లుగా కనిపించింది. గార్డుపై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై దృష్టి సారించి, మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నోయిడా పోలీసులను కోరారు.

గేట్లు తెరవడంలో ఆలస్యమైనందుకు గార్డులతో మహిళ వాగ్వాదానికి దిగింది. ఆ స్త్రీ "మహిళలను గౌరవించడం నేర్చుకో" అని గార్డులకు చెప్పడం కూడా వినబడుతుంది. ఆమె చుట్టూ ఉన్న గార్డులలో ఒకరిని ఆమె కొట్టింది. వీడియోలో ఆమె బీహారీ సమాజాన్ని దుర్భాషలాడడం కూడా వినవచ్చు. సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీ గ్రూప్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.



Next Story