కారులో వెళుతున్న వ్య‌క్తిపై కాల్పులు జ‌రిపిన దుండ‌గులు

నోయిడా సెక్టార్ 104లో బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు కారులో వస్తున్న ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు

By Medi Samrat  Published on  19 Jan 2024 8:45 PM IST
కారులో వెళుతున్న వ్య‌క్తిపై కాల్పులు జ‌రిపిన దుండ‌గులు

నోయిడా సెక్టార్ 104లో బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు కారులో వస్తున్న ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. సూరజ్‌భాన్ జిమ్ నుండి తన కార్ లో వస్తుండగా పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత.. అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూరజ్‌భాన్ తన కారులో కూర్చున్న వెంటనే కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

సూరజ్‌భాన్ మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "సూరజ్‌భాన్ అనే వ్యక్తి జిమ్ నుండి తిరిగి వస్తున్నాడు. అతను తన కారులో కూర్చున్న వెంటనే కొందరు అతనిని కాల్చి చంపారు, అతను ఆసుపత్రికి చేరుకునేలోపే అతను మరణించాడు" అని నోయిడా డిసిపి హరీష్ చందర్ తెలిపారు. నాలుగు వేర్వేరు పోలీసు బృందాలు విచారణ నిర్వహిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సిసిటివి ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

Next Story