మహిళా ఇంజనీర్ హత్య.. వెలుగులోకి భయానక నిజం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మహిళా ఇంజనీర్ హత్యకు సంబంధించిన భయానక నిజం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat
Published on : 7 April 2025 3:22 PM IST

మహిళా ఇంజనీర్ హత్య.. వెలుగులోకి భయానక నిజం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మహిళా ఇంజనీర్ హత్యకు సంబంధించిన భయానక నిజం వెలుగులోకి వచ్చింది. మహిళ తలపై సుత్తితో కొట్టడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ బాధాకరమైన ఘటన చేసింది మరెవరో కాదు ఆ మహిళ భర్త.

సివిల్ ఇంజనీర్ భార్య అస్మా హత్య ఆరోపణలపై భర్త నూరుల్లా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్మా తలపై సుత్తితో కొట్టడంతో రక్తస్రావం అయింది. దీంతో అస్మాకు బ్రెయిన్ హెమరేజ్ ఏర్పడి కోమాలోకి వెళ్లింది. అప్పుడు ఆమె మరణించింది.

నిందితుడు నూరుల్లా హైదర్ తన భార్య అస్మాపై అనుమానంతో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తన భార్య వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానించాడు. దీంతో అనుమానం వచ్చి భార్యను హత్య చేశాడు. ఈ నేపథ్యంలో కొడుకు తన తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడైన‌ భర్తను పోలీసులు గుర్తించి, అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు కొన్ని గంటల పాటు విచారించారు. నోయిడాలోని సెక్టార్-15లో నివాసముంటున్న నూర్ ఉల్లా హైదర్ తన భార్య సివిల్ ఇంజనీర్ అస్మాను శుక్రవారం ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు. నిందితుడు భార్య తలపై సుత్తితో పలుమార్లు కొట్టాడు. దీంతో ఆ మహిళ కొడుకు తన తండ్రిపై కేసు పెట్టాడు. ఫేజ్ వన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హంతకుడు నూర్ ఉల్లాను అరెస్టు చేసి జైలుకు పంపింది.

ఇరువురికి 2005లో వివాహమవ‌గా.. వారికి ఇద్దరు పిల్లలు - ఇంజినీరింగ్ చదువుతున్న ఒక కుమారుడు, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె వుంది. సెక్టార్ 15లోని వారి రెండున్నర అంతస్తుల ఇంటి మొదటి అంతస్తులో కుటుంబం నివసిస్తుండగా.. గ్రౌండ్ ఫ్లోర్‌ను పీజీగా అద్దెకు ఇచ్చారు.

Next Story