చైనా దేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా అధికారులు తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన గల అండర్ గ్రౌండ్‌లో జరిగింది. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు చెలరేగుతున్నాయన్న విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
శుక్రవారం ఉదయం 11:11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1:00 గంటలకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మృతి చెందిన తొమ్మిది మంది బాధితుల్లో ఒక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో చనిపోయాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం తరలించారు. నలుగురు ఇంకా ఆసుపత్రిలో పరిశీలన కోసం ఉన్నారు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.