ఆదివారం పెళ్లి.. మంగళవారం రాత్రి రిసెప్షన్.. ఇంతలో..

Newly-wed couple found dead before reception party in Chhattisgarh. మృత్యువు ఎవరిని, ఎప్పుడు కబళించి వేస్తుందో అసలు ఊహించలేము.

By M.S.R  Published on  22 Feb 2023 7:18 PM IST
ఆదివారం పెళ్లి.. మంగళవారం రాత్రి రిసెప్షన్.. ఇంతలో..

మృత్యువు ఎవరిని, ఎప్పుడు కబళించి వేస్తుందో అసలు ఊహించలేము. కొత్తగా పెళ్ళైన జంట జీవితం ఇంత ఘోరంగా తారుమారు అవుతుందని.. కుటుంబాల్లో తీరని శోకం మిగులుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో పెళ్లి రిసెప్షన్ కు ముందు పెళ్లి జంట మరణించింది.

కొత్తగా పెళ్ళైన జంటపై కత్తిగాయాలు ఉన్నాయి. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story