పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కలలుగన్న ఆ పెళ్లి జంటకు ఆయువు అప్పుడే నిండిపోయింది. ఎన్నో కలలతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన వారికి ఆ పెళ్లి వేడుకే చివరిది అయ్యింది. నవ వధువు ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందాడు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులకు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువతి కనిమొళితో పెళ్లి జరిగింది.

వీరి వివాహం తిరుపతిలో వైభవంగా జరిగింది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ కొత్త పెళ్లి జంట.. వధువు ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో వరుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా వధువు కనిమొళి తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు మృతి చెందింది. పెళ్లై ఒక రోజు గడవక ముందే పెళ్లి కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ పెళ్లి కుమార్తె మృతి చెందింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story