అనారోగ్యంతో తల్లి.. సహాయం చేయాలని కోరిన.. బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం

Neighbour rapes minor who sought medicine for sick mother. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి అనారోగ్యంతో ఉందని మందులు తేవడానికి సహాయం చేయాలని

By అంజి  Published on  26 Jan 2022 2:35 PM IST
అనారోగ్యంతో తల్లి.. సహాయం చేయాలని కోరిన.. బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి అనారోగ్యంతో ఉందని మందులు తేవడానికి సహాయం చేయాలని పొరుగింటి వ్యక్తిని మైనర్‌ బాలిక అర్జింజింది. అయితే ఆ వ్యక్తి బాలికను సహాయం చేస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ఓ దూరపు ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఓడిగట్టాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం సహాయం కోరినందుకు ఢిల్లీలో ఒక మైనర్ బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జనవరి 22న ఈ ఘటన జరగ్గా, మరుసటి రోజు కేసు నమోదైంది.

ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో.. తన తండ్రి గ్రామానికి వెళ్లాడని, అనారోగ్యంతో ఉన్న తల్లితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నానని బాలిక తెలిపింది. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో బాలిక ఇరుగుపొరుగు వారిని ఆశ్రయించింది. పొరుగువాడు అరుణ్‌గా గుర్తించి, మందులు ఇప్పిస్తానని చెప్పి, బాలికను వారి ప్రాంతం నుండి దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఆమెను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story