దళిత యువకుడి జననాంగాలను కోసేసిన ఇద్దరు హిజ్రాలు
Nargis and Zoya cut off the genitals of a Dalit youth working in Ramlila. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దళిత యువకుడి జననాంగాలను కోసేసి చంపేందుకు
By Medi Samrat Published on 1 Dec 2021 3:46 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దళిత యువకుడి జననాంగాలను కోసేసి చంపేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నర్గీస్ అలియాస్ ఫుర్కాన్, జోయా అలియాస్ తలీమ్‌గా గుర్తించారు. ఈ కేసులో మున్నా అనే హిజ్రాతో సహా మొత్తం 6 మందిపై అభియోగాలు మోపారు. బాధితుడి తండ్రి కొడుకును వెతుక్కుంటూ మున్నా ఇంటికి చేరుకోగా, యువకుడి జననాంగాలు కోసి వేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అప్పటికే అతనికి తీవ్రంగా రక్తం కారుతోందని గమనించారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితుడి తండ్రిని బెదిరించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
బాధితుడి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పురానా పట్టణంలోని ఖురేషియా ప్రాంతానికి చెందిన నర్గీస్ అలియాస్ ఫుర్కాన్ మరియు దేశ్‌రాజ్ ప్రాంతానికి చెందిన జోయా అలియాస్ తలీమ్ లను పట్టుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 147, 148, 326, 307, 506, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) 5 కింద కేసు నమోదు చేశారు. తన స్నేహితుడితో కలిసి మంగళవారం (నవంబర్ 23, 2021) రాత్రి 10 గంటలకు తన కొడుకు కోసం వెతుకుతూ మున్నా ఇంటికి వెళ్లినట్లు ఫిర్యాదులో తెలిపారు.
అక్కడ మున్నాతో పాటు నర్గీస్ అలియాస్ ఫుర్కాన్, జోయా అలియాస్ తలీమ్, నసీర్, మరో ఇద్దరు అతని కుమారుడి జననాంగాలను కోసివేసిన విషయాన్ని గమనించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు వారిని కూడా చంపేస్తామని బెదిరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కొత్వాలి ఇన్‌ఛార్జ్ తాపేశ్వర్ సింగ్ తెలిపారు. దళిత యువకుడు రాంలీలాలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీ రఘుబర్ రామ్‌లీలా కమిటీ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపారు.