పిల్ల‌ల కోసం మహిళను 16 నెలల పాటు బందీగా ఉంచి అత్యాచారం.. ఆ త‌ర్వాత ఏం చేశారంటే..

Nagpur woman raped, forced to bear child by couple in Ujjain. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల మహిళను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో దంపతులు బందీగా

By Medi Samrat  Published on  12 Nov 2021 6:58 PM IST
పిల్ల‌ల కోసం మహిళను 16 నెలల పాటు బందీగా ఉంచి అత్యాచారం.. ఆ త‌ర్వాత ఏం చేశారంటే..

మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల మహిళను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో దంపతులు బందీగా ఉంచి, అత్యాచారం చేసి, బలవంతంగా బిడ్డను కన్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. మహిళను 16 నెలల పాటు బందీగా ఉంచి, అత్యాచారం చేసి, బిడ్డను కనాలని బలవంతం చేసిన కేసులో కాత్ బరోడా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ (38)ను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సత్యేంద్ర శుక్లా తెలిపారు. నాగ్‌పూర్‌కు చెందిన మహిళ దేవాస్ గేట్ బస్టాండ్‌లో కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని.. నవంబర్ 6న ఆమెను రాజ్‌పాల్ సింగ్ అపస్మారక స్థితిలో పడేసినట్లు అధికారి తెలిపారు. స్పృహలోకి రావడంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రాజ్‌పాల్ సింగ్ 16 నెలల క్రితం బాధితురాలిని ఒక మహిళ సహాయంతో కొనుగోలు చేసి ఉజ్జయినికి తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు. రాజ్‌పాల్ సింగ్ తన భార్య చంద్రకాంత(26)తో కుమ్మక్కై, ఈ ఇద్ద‌రు దంపతులు త‌మ ఇద్ద‌రు పిల్లలను కోల్పోయినందున.. సింగ్ బాధితురాలిని బందీగా ఉంచి, బిడ్డ కోసం ఆమెపై అత్యాచారం చేశాడని ఎస్పీ తెలిపారు. అక్టోబరు 25న బాధితురాలు పాపకు జన్మనిచ్చిన తర్వాత.. నవంబర్ 6న సింగ్ ఆమెను బస్టాండ్‌లో పడేశారు.

పోలీసులు దంపతులతో పాటు రాజ్‌పాల్ సింగ్ బంధువు వీరేంద్ర, కృష్ణ పాల్, అర్జున్ అనే ముగ్గురు వ్య‌క్తుల‌పై కూడా ప‌లు సెక్ష‌న్‌ల‌ కింద కేసు నమోదు చేశారు. రాజ్‌పాల్ సింగ్‌ బాధితురాలిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశాడనే దానిపై దర్యాప్తు చేయడానికి పోలీసు బృందాన్ని నాగ్‌పూర్‌కు పంపుతామని.. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారి తెలిపారు.


Next Story