విజయవాడలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. దుర్గా అగ్రహారంలో శుక్రవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో నరికి చంపడంతో స్థానికులంతా షాక్ అయ్యారు. నడిరోడ్డుపై రక్తపు మడుగులో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్నపోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆగంతకులు బైక్‌లపై వచ్చి స్ధానికంగా ఉండే ఓ వ్యక్తిని రోడ్డుపై ఆపి అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుండి వారు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. స్ధానికంగా ఉన్న షాపులు, రోడ్లపై ఉన్నసీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరిస్తున్నారు.