ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన‌ భార్య

Mumbai Man, 34, Killed By Wife, Her Lover. వీకెండ్ లో ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిందో భార్య .

By Medi Samrat  Published on  23 May 2022 2:56 PM IST
ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన‌ భార్య

వీకెండ్ లో ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిందో భార్య . ఈ ఘటన మహారాష్ట్ర గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివాజీ నగర్ పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 కింద నేరం నమోదు చేయబడింది. 34 ఏళ్ల వ్యక్తిని అతని 32 ఏళ్ల భార్య, ఆమె ప్రేమికుడు చంపారు.

శివాజీ నగర్ పోలీసులు ఆమె భర్త హత్య వెనుక ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియుడి సాయంతో భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం మాత్రం అందించారు. శనివారం రాత్రి హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున శివాజీ నగర్ పోలీసులకు హత్యపై సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు ప్రేమికుడితో పాటు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు.










Next Story