భర్త అడిగాడని అలాంటి ఫోటోలు పంపించకూడదు.. మహిళా పోలీసు కానిస్టేబుల్ భర్త చేసిన దారుణం

Mumbai cop’s husband arrested for circulating her nude photos. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ భర్త.. ఏ భర్త చేయకూడని దారుణానికి తెగబడ్డాడు.

By Medi Samrat  Published on  19 March 2022 2:15 PM GMT
భర్త అడిగాడని అలాంటి ఫోటోలు పంపించకూడదు.. మహిళా పోలీసు కానిస్టేబుల్ భర్త చేసిన దారుణం

ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ భర్త.. ఏ భర్త చేయకూడని దారుణానికి తెగబడ్డాడు. భార్య నగ్న చిత్రాలను తన స్నేహితుడికి, మరికొందరు బంధువులకు పంపాడనే ఆరోపణలపై బాధితురాలి భర్తను మెరైన్ డ్రైవ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు పలు సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 27 ఏళ్ల మ‌హిళా కానిస్టేబుల్‌కు కొన్నేళ్ల క్రితం పూణేకు చెందిన 31 ఏళ్ల యువకుడితో వివాహమైంది. వారికి ఇప్పుడు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక బిడ్డ ఉంది. ఏడాది క్రితం విడిపోయారు. మహిళా కానిస్టేబుల్ ఎంఎంఆర్‌లో నివసిస్తుండగా.. ఆమె భర్త పూణేలో నివసిస్తున్నారు.

వారు కలిసి ఉన్నప్పుడు, తన భర్త తనకు చాలాసార్లు ఫోన్ చేసి నగ్న ఫోటోలు పంపమని అడిగారని.. అయితే ఆమె నిరాకరించిందని పోలీసు చెప్పాడు. భర్త ఆమెను ఒత్తిడి చేయడంతో ఆమె తన ప్రైవేట్ ఫోటోలు రెండు-మూడు అతనికి పంపింది. ఆ ఫొటోలను డిలీట్ చేయమని తాను అడిగానని.. అయితే అతను అలా చేయలేదని తెలిపింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో.. ఇటీవల బాధిత మహిళ స్నేహితురాలు ఒకరు ఆమెకు ఫోన్ చేసి, తన భర్త తనకు నగ్న చిత్రాలను పంపాడని తెలిపింది. దీంతో ఆ కానిస్టేబుల్‌ తన భర్తపై మెరైన్‌ డ్రైవ్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

సదరు వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. భార్యపై భర్తకు అనుమానం ఉండేదని, అందుకే వారిద్దరూ గొడవ పడేవారని పోలీసులు తెలిపారు. ఆ మహిళకు పెళ్లి కాకముందే వేరే వ్యక్తితో సంబంధం ఉందని, అది ఆ తర్వాత లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. అయితే భర్త మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఆమె పరువు తీసేందుకు, ఆమె భర్త తన నగ్న ఫోటోలను తన స్నేహితుడికి, కొంతమంది బంధువులకు పంపాడు. ఆమెది మంచి క్యారెక్టర్ కాదని చూపించడమే అతడి ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు. ఆమె భర్తను అరెస్టు చేసాము మరియు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని ఒక పోలీసు అధికారి చెప్పారు.
Next Story
Share it