కూతురు కనిపించలేదు.. భర్తపై అనుమానం ఉందని ఫిర్యాదు.. విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు

Mother kills 6-year-old daughter. నోయిడాలో 6 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో పోలీసులకు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది

By Medi Samrat  Published on  6 Dec 2021 5:45 AM GMT
కూతురు కనిపించలేదు.. భర్తపై అనుమానం ఉందని ఫిర్యాదు.. విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు

నోయిడాలో 6 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో పోలీసులకు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. తన కూతురు తప్పిపోయిందని భర్తపైనే అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఓ తల్లి తన 6 ఏళ్ల కూతురిని హత్య చేసి, మృతదేహాన్ని అడవుల్లో పడేసింది. తన భర్తపై నిందమోపి తన కుమార్తె తప్పిపోయినట్లు అధికారులకు ఫిర్యాదు చేసింది. మొత్తం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

నవంబర్ 12 న, నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నోయిడాలోని సెక్టార్-93లో ఒక బాలిక శవం కనుగొనబడింది. బాలిక శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఆ అమ్మాయి పేరు నేహా శర్మ అని విచారణలో తేలింది. ఆ బాలిక వయసు కేవలం ఆరేళ్లు. ఆ బాలిక తల్లి పేరు అనురాధ, ఆమె అలీఘర్‌కు చెందినది. నోయిడాలోని సెక్టార్ 93లో నివసించేది. అనురాధ, రామ్‌కుమార్‌లు వివాహం చేసుకున్నారు. 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు రామ్‌కుమార్‌.

రాజ్‌కుమార్‌ ఇటీవలే నోయిడాలోని సెక్టార్-93లో ఇల్లు కొనుక్కున్నాడు. అతను దానిని త్వరలోనే ఎవరికైనా ఇవ్వాలని అనుకున్నాడు. అనురాధ ఆ ఇంటిని దక్కించుకోవాలని భావించింది. తన భర్త అడ్డు తొలగించుకుంటే మొదటి భార్యను తానే కాబట్టి ఆ ఇల్లు తనకే దక్కుతుందని ప్లాన్ చేసి. తన కుమార్తెను హత్య చేసి భర్తను ఇరికించాలని అనుకుంది. అతన్ని అరెస్టు చేస్తే.. అతని ఇల్లు ఆమె సొంత మవుతుందనే పన్నాగం పన్నింది. దీంతో అనురాధ తన కుమార్తెను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసింది. ఈ హత్య కేసులో కొన్ని క్లూల ద్వారా అనురాధ ఈ హత్యకు పాల్పడిందని భావించారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది.


Next Story
Share it