సత్యసాయి జిల్లాలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలు స‌హా తల్లి ఆత్మ‌హ‌త్య‌

Mother along with her two children committed suicide. సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat
Published on : 2 July 2023 7:27 PM IST

సత్యసాయి జిల్లాలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలు స‌హా తల్లి ఆత్మ‌హ‌త్య‌

సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ మండల కేంద్రం టీచర్స్‌కాలనీకి చెందిన గంగాధర్‌, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వేధింపులను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం సుకన్య తన ఇద్దరు పిల్లలు దేవయాని(10), జస్మిత(9)తో కలసి సమీపంలోని చెరువులో దూకింది. స్థానికులు వెంటనే చెరువులో దూకి గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా తల్లి సుకన్య మృతదేహం కొద్ది దూరంలో లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. సుకన్య, ఆమె భర్త గంగాధర్‌కు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుకన్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story