బీహార్‌లోని అరారియాలో మైనర్ దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడు మహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ నేపాల్‌కు పారిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత అతడిని పట్టుకోడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు.. కానీ 12 రోజుల తర్వాత ఈ అరెస్టు చోటు చేసుకుంది. నిందితుడు ఢిల్లీ సహా పలు ప్రాంతాలలో తిరుగుతూ తన ఆచూకీ దొరక్కుండా తప్పుంచుకుంటూ వచ్చాడు. అయితే ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో మహ్మద్ ను పోలీసులు పట్టుకున్నారు.
అరారియా పోలీసులు ఈ అరెస్టును ధృవీకరించారు. అరెస్టు డిసెంబర్ 13 (సోమవారం) న చోటు చేసుకుంది. అరారియా ఎస్పీ హృదయకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత మహ్మద్ పరారీలో ఉన్నాడు. అతను ఢిల్లీ వైపు ఉన్నాడని మాకు పక్కా సమాచారం అందింది. అదే ప్రాంతానికి పోలీసు బృందాన్ని పంపించాం. నిందితుడు మొదట నోయిడాకు వెళ్లి, ఆపై ఢిల్లీ, తరువాత గురుగ్రామ్, తరువాత మీరట్‌లో తలదాచుకోవడానికి ప్రయత్నించాడు. నిందితుడు తనకు తెలిసిన వారి మధ్య దాక్కోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. కానీ ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ అంగీకరించలేదు. ఈ అరెస్టు విషయంలో రాష్ట్రాల పోలీసులు చాలా సహకరించారు. నిందితుడు మహ్మద్ నేపాల్ కు పారిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో చాందినీ చౌక్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.