మాట్లాడుకుందామని పిలిచాడు.. మోడల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు

Model raped by Mumbai-based man at five-star. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై అత్యాచారం జరిగింది. మాట్లాడుకుందామని పిలిచి

By Medi Samrat  Published on  27 Feb 2021 3:34 PM IST
మాట్లాడుకుందామని పిలిచాడు.. మోడల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై అత్యాచారం జరిగింది. మాట్లాడుకుందామని పిలిచి అత్యాచారం చేశారు. ఈ అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్‌)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్‌లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్‌లో‌ దింపాడు.

అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని మెసేజీల ద్వారా కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను ఖాన్ మార్కెట్‌ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది. ఇద్దరు కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్‌ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్‌ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.


Next Story