కొద్దిరోజుల కిందట ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం ఎవరో ఆమె చెప్పలేదు. అయితే విద్యార్థుల్లో గుసగుసలు.. దానికి తోడు రూమర్స్.. దీంతో ఓ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. పరువు పోతుందన్న ఉద్దేశ్యమో.. మరేదో కానీ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. తమిళనాడు కరూర్ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు తిరుచ్చిలోని సెంగట్టుపట్టిలోని తన మామగారి నివాసంలో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు. బుధవారం నాడు 44 ఏళ్ల గణిత ఉపాధ్యాయుడు తన విద్యార్థి లైంగిక వేధింపులతో సంబంధం కలిగి ఉన్నదనే రూమర్స్ కారణంగా తన జీవితాన్ని ముగించాడు.

లైంగిక వేధింపుల కారణంగా 16 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ బాలిక ఎవరి పేరు చెప్పనప్పటికీ తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సూసైడ్ నోట్‌లో రాసుకుని వచ్చాడు. కొన్ని రోజుల ముందు లైంగిక వేధింపుల ఆరోపణతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయగా బాలిక అక్కడే చదువుతున్నట్లు గుర్తించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న గణితం టీచర్ ఆమెకు ఎటువంటి క్లాస్ లు కూడా బోధించలేదు. విద్యార్థులు అతని పేరును బాలిక ఆత్మహత్యతో ముడిపెట్టి, అతనిని ఈ విషయంలోకి లాగారు. దీంతో మ్యాథ్స్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

గత వారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన 12వ తరగతి విద్యార్థిని తన సూసైడ్ నోట్‌లో ఇలా రాసింది.''లైంగిక వేధింపుల కారణంగా కరూర్ జిల్లాలో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను. నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని మరియు ఇతరులకు సహాయం చేయాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు నేను లోకాన్ని విడిచిపెడుతున్నాను" అని తెలిపింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story