Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు

కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.

By Medi Samrat  Published on  24 April 2024 10:59 AM IST
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు

మెదక్: కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది. టీచర్ మిస్సింగ్ వెనుక మిస్టరీని చేగుంట పోలీసులు మంగళవారం చేధించారు. హత్యకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ZPHS మాసాయిపేటలో హిందీ ఉపాధ్యాయుడు నాగరాజు మార్చి 28 న తన అద్దె ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి అందుబాటులో లేకపోవడంతో, నాగరాజు కుమారుడు వంశీ ఏప్రిల్ 1 న చేగుంట పోలీసులను ఆశ్రయించాడు.

విచారణలో నాగరాజు పొరుగింట్లో ఉండే వంగ సత్యనారాయణ అలియాస్ సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య వంగ స్వాతి (35)తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన బావ వర్కల మల్లేశం, అతని స్నేహితుడు జిల్లా సునీల్ గౌడ్‌తో కలిసి మార్చి 28న నాగరాజును హత్య చేసినట్లు సతీష్‌ అంగీకరించాడు. మరుసటి రోజు మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోలీసులు సతీష్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా, స్వాతి ఏప్రిల్ 21న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు నిందితులు అందించిన సమాచారం ఆధారంగా, పోలీసులు ప్రగతినగర్ చెరువు నుండి మృతదేహాన్ని వెలికితీశారు.

Next Story