మైన‌ర్‌ బాలుడిని లైంగికంగా వేధించిన‌ ఐదుగురు అబ్బాయిలు

Minor sodomised by 5 boys of his neighbourhood in north Delhi. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓ టీనేజీ బాలుడిని ఐదుగురు అబ్బాయిలు

By Medi Samrat  Published on  11 Feb 2023 5:31 PM IST
మైన‌ర్‌ బాలుడిని లైంగికంగా వేధించిన‌ ఐదుగురు అబ్బాయిలు

ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓ టీనేజీ బాలుడిని ఐదుగురు అబ్బాయిలు లైంగికంగా వేధించారు. ఈ ఘటనపై శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. సీఐసీ కౌన్సెలర్‌తో ఐఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌, సీపీడబ్ల్యూవో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికంగా ఉన్న కొందరు అబ్బాయిలు తనను లైంగికంగా వేధించారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడి తల్లి తన కుమారుడి ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు అబ్బాయిలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితుడిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377 (అసహజ నేరాలు)తో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సెక్షన్ 4 కింద కూడా కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

Next Story