తండ్రిని కొట్టాడని.. వీధిలో తుపాకీతో చెలరేగిన మైనర్ బాలుడు
Minor shoots man to avenge father's beating. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో తన తండ్రిని కొట్టినందుకు
By Medi Samrat Published on 17 July 2022 6:44 PM ISTదేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో తన తండ్రిని కొట్టినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మైనర్ బాలుడు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో బాధితులు పార్కు సమీపంలో కూర్చొని ఉన్నాడు. అక్కడికి తన ఫ్రెండ్స్ తో మైనర్ బాలుడు వచ్చాడు. వారిలో ఒక వ్యక్తిపై కాల్పులు జరపడంతో అందరూ పారిపోయారు. బాధితుడి కంటికి బుల్లెట్ తగిలింది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. ఒకరిపై కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడిని జహంగీర్‌పురిలోని హెచ్-4 బ్లాక్‌కు చెందిన జావేద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రుడిని బీజేఆర్‌ఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. విచారణలో హెచ్-4 బ్లాక్‌లో నివాసం ఉంటున్న అన్సార్ అహ్మద్ కుమారుడు 36 ఏళ్ల జావేద్ కుడి కంటికి కాల్చినట్లు తేలింది. సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో హెచ్-3 బ్లాక్‌లోని పార్కు దగ్గర కూర్చున్నట్లు బాధితుడు తెలిపాడు.
ఈ విషయమై పోలీసులు జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. నలుగురు మైనర్‌లను ప్రత్యేక సిబ్బంది బృందం అరెస్టు చేసింది. కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడు నెలల క్రితం మైనర్ బాలుడి తండ్రిని బాధితుడు కొట్టాడు.. అతడిపై పగ తీర్చుకునేందుకు మైనర్ బాలురు వచ్చాడని పోలీసులు తెలిపారు.