యూట్యూబ్ స్టార్ ను చేస్తానని చెప్పి.. మైనర్ బాలికపై అత్యాచారం
Minor raped under the pretext of making actress. నిజాముద్దీన్ అలియాస్ రాజ్‌ఖాన్ అనే వ్యక్తి మైనర్ బాలికను పెద్ద యూట్యూబ్ స్టార్
By Medi Samrat Published on 31 Jan 2022 12:09 PM ISTనిజాముద్దీన్ అలియాస్ రాజ్‌ఖాన్ అనే వ్యక్తి మైనర్ బాలికను పెద్ద యూట్యూబ్ స్టార్ ని చేస్తానంటూ ఓ మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది. బాధితురాలు 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని అని తేలింది. ఈ కేసులో నిజాముద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముద్దీన్ బాలికను జోధ్‌పూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. బాధితురాలి వయస్సు కేవలం 16 సంవత్సరాలు.
బాధితురాలిని యూట్యూబ్‌లో సెలబ్రిటీని చేస్తానని నిందితుడు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాధితురాలు యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ.. మూడు నాలుగేళ్లుగా వీడియో ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. బాబ్రా హాల్‌లో నివాసం ఉంటున్న నిజాముద్దీన్‌ను ఇటీవల కలిశాడు. ఆమెను టాప్ యూట్యూబర్ గా చేయడమే కాకుండా.. ఆమెకు భారీగా ఆదాయం కూడా వస్తుందని సూచించాడు. బాధితురాలు అతడి వలలో పడింది. జనవరి 8, 2022న బాధితురాలితో జోధ్‌పూర్ చేరుకుని ఆమెను ఒక ఫ్లాట్‌లో ఉంచాడు.
బాధితురాలితో కామెడీ వీడియో కూడా చిత్రీకరించాడు. అదే రోజు రాత్రి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతానని బాధితురాలు చెప్పడంతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. హత్య చేస్తానని కూడా బెదిరించారు. మైనర్ భయంతో కొన్ని రోజులు మౌనంగా ఉంది. బాధితురాలు జరిగిన ఘటన గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జైలుకు తరలించారు. మైనర్ బాధితురాలు పలువురు ప్రసిద్ధ హాస్యనటులతో కూడా పని చేసింది. రిమాండ్ వ్యవధి పూర్తయిన తర్వాత కూడా నిందితుడిని జైలులో ఉంచారు.