5 ఏళ్ల బాలికపై అత్యాచారం, గొంతు కోసి హత్య.. ఇంటి పైకప్పుపై మృతదేహం

Minor girl Sexual assault, killed in Madhya Pradesh.. body found on roof of her house. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు

By అంజి
Published on : 28 Dec 2021 8:39 AM IST

5 ఏళ్ల బాలికపై అత్యాచారం, గొంతు కోసి హత్య.. ఇంటి పైకప్పుపై మృతదేహం

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్‌పూర్ ప్రాంతంలోని ఆమె ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహం శనివారం కనిపించిందని సోహగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ రజక్ తెలిపారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రాథమిక శవపరీక్ష నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు సూచించినట్లు ఆయన తెలిపారు. బాధితురాలి పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారి తెలిపారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా తమ గ్రామంలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వారి ఇంటి పైకప్పును పరిశీలించగా మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు గుర్తు తెలియని నిందితుడిపై అత్యాచారం మరియు హత్య సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story