బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారం

Minor Girl Raped In Ballia. బలియా గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.

By అంజి  Published on  24 Nov 2021 8:23 AM GMT
బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బాలికలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామ మృగాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బలియా గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌హెచ్‌ఓ గద్వార్ పోలీస్ స్టేషన్, దుర్గేశ్వర్ మిశ్రా మాట్లాడుతూ.. మైనర్ బాలిక సోమవారం సాయంత్రం తనను తాను ఉపశమనం చేసుకోవడానికి బయటకు వెళ్లిందని, ఈ క్రమంలోనే పొరుగు గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు ఆమెను పట్టుకుని అత్యాచారం చేశారని తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

దేశంలో మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. నిత్యం దేశ వ్యాప్తంగా 77 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని ఇటీవల ఓ ప్రభుత్వ సంస్థ నివేదిక వెల్లడించింది. ఇక అత్యధికంగా అత్యాచార కేసులు రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, అస్సాంలో నమోదు అవుతున్నాయి. అత్యాచార ఘటనలను నిరోధించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల్లో ఏ మాత్రం బెణుకు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Next Story