దారుణం.. స్కూల్‌ టాయిలెట్‌ రూమ్‌లో బాలికపై స్వీపర్ అత్యాచారం

Minor girl raped by sweeper in Varanasi private school. ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో మైనర్ బాలికపై స్వీపర్

By అంజి  Published on  28 Nov 2021 7:52 AM GMT
దారుణం.. స్కూల్‌ టాయిలెట్‌ రూమ్‌లో బాలికపై స్వీపర్ అత్యాచారం

ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో మైనర్ బాలికపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని లహర్తర ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడిని 23 ఏళ్ల సింకూగా గుర్తించారు. అతడిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదుతో సింకూపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేసిన తర్వాత నిందితులపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సిగ్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బాజినాథ్ సింగ్ తెలిపారు.

శుక్రవారం ఉదయం పాఠశాలలోని టాయిలెట్‌కు వెళ్లిన మైనర్ బాలికపై నిందితుడు స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అత్యాచారం అనంతరం ఆమెను బెదిరించి నోరుమూయించాడు. దీంతో భయపడిన బాలిక టీచర్లకు ఏమీ చెప్పలేదు. స్వీపర్ నుండి తప్పించుకున్న తరువాత బాలిక ఇంటికి చేరుకుని నొప్పితో బాధపడుతూ తల్లికి జరిగిని విషయం చెప్పింది. బాలిక కుటుంబం సభ్యులు పాఠశాలకు చేరుకోగానే, మొదట పాఠశాల యాజమాన్యం అత్యాచార విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది.

అయితే ఇంతలో, కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రస్తుతం ఫిర్యాదు మేరకు పోలీసులు స్వీపర్‌పై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

Next Story
Share it