మహారాష్ట్రలో ఓ ఉన్మాది దారుణానికి తెగించాడు.. ప్రేమించడం లేదని ఓ మైనర్ బాలికను అతిదారుణంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన పుణె నగరంలో బిబేవాడీలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలిక రోజు వారిలాగే స్కూల్‌కు వెళ్లి సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చి.. తిరిగి కబడ్డీ ప్రాక్టీసు కోసమని గ్రౌండ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో ప్రాక్టీసుకు వెళ్తున్న బాలికను ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి టీజ్ చేశారు.

మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ముగ్గురు యువకుల్లో బాలికకు దూరపు బంధువైన యువకుడు కూడా ఉన్నాడు. బంధువైన యువకుడు ప్రేమించాలంటూ ఒత్తిడి చేసిన బాలిక ససేమిరా అనడంతో... కత్తితో బాలికను పలుమార్లు పొడిచి చంపాడు. ముగ్గురు యువకులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.


అంజి

Next Story