పాత బ‌స్తీలో దారుణం.. మైన‌ర్ బాలిక కిడ్నాప్‌.. లాడ్జిలో నిర్భంధించి సామూహిక అత్యాచారం

Minor Girl Molested by two men in Old City.మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసిన యువ‌కులు ఓ లాడ్జిలో నిర్భందించి అత్యాచారానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2022 10:16 AM IST
పాత బ‌స్తీలో దారుణం.. మైన‌ర్ బాలిక కిడ్నాప్‌.. లాడ్జిలో నిర్భంధించి సామూహిక అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు నిత్యం ఏదో ఒక చోట చిన్నారులు, బాలిక‌లు, మ‌హిళ‌లు, వృద్దులు అనే తేడా లేకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్ప‌డుతూనే ఉన్నారు. ఓ మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసిన యువ‌కులు ఓ లాడ్జిలో నిర్భందించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న పాత‌బ‌స్తీలో జ‌రిగింది.

చంచ‌ల్‌గూడ‌లో 13 ఏళ్ల బాలిక త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఈ నెల 12న అదే ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు యువ‌కులు కారులో వ‌చ్చి బాలిక‌ను కిడ్నాప్ చేశారు. మాయ‌మాట‌ల‌తో నాంప‌ల్లిలోని ఓయో లాడ్జికి తీసుకువెళ్లారు. అక్క‌డ బాలిక‌కు మ‌త్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. త‌మ కామ‌వాంఛ తీర్చుకున్న దుర్మార్గులు.. అనంత‌రం బాలిక‌ను అక్క‌డే వ‌దిలివేసి వెళ్లిపోయారు.

బాలిక త‌ల్లిదండ్రులు డబీర్‌పురా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. నిందితులు ఇద్ద‌రు బాలిక‌కు తెలిసిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story