వ్య‌భిచారం చేసేందుకు నిరాక‌రించిన బాలిక.. హత్య చేసిన అక్కలు.!

Minor Girl Forced Into Prostitution By Elder Sister, Killed By Two Lovers. జార్ఖండ్‌లో ఏడు నెలల క్రితం అదృశ్యమైన బాలిక (17) మృతదేహం లభ్యమైంది. సోనార్‌ డ్యాం వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.

By అంజి  Published on  25 Oct 2021 9:54 AM GMT
వ్య‌భిచారం చేసేందుకు నిరాక‌రించిన బాలిక.. హత్య చేసిన అక్కలు.!

జార్ఖండ్‌లో ఏడు నెలల క్రితం అదృశ్యమైన బాలిక (17) మృతదేహం లభ్యమైంది. సోనార్‌ డ్యాం వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. మేజిస్ట్రేట్‌ సమక్షంలో బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో బాలిక తలకు తీవ్ర గాయమైనట్లు తెలిసింది. మైనర్‌ బాలికను ఆమె సోదరీమణులు రాఖీదేవీ, రూపాదేవి, బావ ధనుంజయ్‌ అగర్వాల్‌, ప్రతాప్‌ కుమార్‌ సింగ్‌, నితీష్‌లు కలిసి హత్య చేశారు. పరారీలో ఉన్న నితీష్‌ మినహా నిందితులందరూ అరెస్ట్‌ అయ్యారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయిందంటూ ఆమె సోదరీమణులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక తల్లిదండ్రులు మరణించడంతో సుద్నాలో వ్యభిచార వృత్తిలో ఉన్న తన సోదరి రాఖీదేవీ ఇంట్లో బాలిక నివసిస్తోందని ఎస్‌డీపీఓ విజయ్‌ శంకర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే బాలికను తన సోదరి రాఖీదేవీ, బావ ధనుంజయ్‌లు కలిసి వ్యభిచార వృత్తి చేయాలంటూ తీవ్ర ఒత్తిడికి గురిచేశారు.

బలవంతంగా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపారు. ఆమె ఇష్టం లేకున్న కస్టమర్ల దగ్గరకు బాలికను పంపేవారు. అదే సమయంలో తాను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని బాలిక చెప్పడంతో.. వారు అందుకు నిరాకరించారు. ఇదే సమయంలో బాలికపై రాఖీ లవర్స్‌ ప్రతాప్‌, నితేష్‌లు కన్నేశారు. రాఖీ సాయంతో బాలికపై చాలాసార్లు అత్యాచారం చేశారు. హత్యకు రెండు రోజుల ముందు ప్రతాప్‌ రాఖీ ఇంటికి వచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం రాఖీ లేని సమయంలో బాలికపై ప్రతాప్‌ అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను చంపి.. ఆమె శరీరాన్ని ఉరితీశారు. ఈ విషయాన్ని రాఖీ, రూప, ధనుంజయ్‌లకు ప్రతాప్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ధనుంజయ్‌ ఆటో రిక్షాతో వచ్చి.. ఐదుగురు కలిసి మృతదేహాన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పాతిపెట్టారు. పాతిపెట్టడానికి ముందుకు ఇంట్లో మృతి చెందిన బాలిక దుస్తులను నిందితులు మార్చారు.

Next Story
Share it