పిల్లలను కిరాతకంగా చంపిన వ్యక్తి.. ఎన్ కౌంటర్‌లో హతం
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 20 March 2024 9:30 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బాబా కాలనీలో జరిగింది. నిందితుడిని 22 ఏళ్ల సాజిద్‌గా గుర్తించబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించిన 12, 10, 8 సంవత్సరాల వయసు ఉన్న ముగ్గురు అన్నదమ్ములపై దాడి చేశాడు. ఈ దాడిలో 12, 8 సంవత్సరాల వయస్సున్న పిల్లలు మరణించగా, మూడవ పిల్లాడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు.
సాజిద్ బార్బర్ గా పని చేస్తూ ఉండేవాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో సాజిద్ హతమయ్యాడు. బుధవారం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటన అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని పోలీసు ఉన్నతాధికారి రాకేష్ సింగ్ వివరించారు. దాడి వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. సాజిద్ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, పోలీసులు ఎదురుపడినప్పుడు రక్తంతో తడిసిన బట్టలతో కనిపించాడని చెప్పారు.
బుదౌన్ ఎస్‌ఎస్‌పీ అలోక్ ప్రియదర్శి మాట్లాడుతూ.. 'నిందితుడు సాజిద్ మంగళవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించాడు. పిల్లలు ఆడుకుంటున్న టెర్రస్‌పైకి వెళ్లి ఇద్దరు పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు." దాడిలో మరణించిన పిల్లల తండ్రి ఈ సంఘటనపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. పోలీసులు సంఘటన స్థలం నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఎన్ కౌంటర్ చేశారు
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని సఖాను గ్రామంలో 22 ఏళ్ల వ్యక్తి.. అతడి ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలుళ్ళ గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బాబా కాలనీలో జరిగింది. నిందితుడిని 22 ఏళ్ల సాజిద్‌గా గుర్తించబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించిన 12, 10, 8 సంవత్సరాల వయసు ఉన్న ముగ్గురు అన్నదమ్ములపై దాడి చేశాడు. ఈ దాడిలో 12, 8 సంవత్సరాల వయస్సున్న పిల్లలు మరణించగా, మూడవ పిల్లాడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు.
సాజిద్ బార్బర్ గా పని చేస్తూ ఉండేవాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో సాజిద్ హతమయ్యాడు. బుధవారం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటన అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని పోలీసు ఉన్నతాధికారి రాకేష్ సింగ్ వివరించారు. దాడి వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. సాజిద్ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, పోలీసులు ఎదురుపడినప్పుడు రక్తంతో తడిసిన బట్టలతో కనిపించాడని చెప్పారు.
బుదౌన్ ఎస్‌ఎస్‌పీ అలోక్ ప్రియదర్శి మాట్లాడుతూ.. 'నిందితుడు సాజిద్ మంగళవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించాడు. పిల్లలు ఆడుకుంటున్న టెర్రస్‌పైకి వెళ్లి ఇద్దరు పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు." దాడిలో మరణించిన పిల్లల తండ్రి ఈ సంఘటనపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. పోలీసులు సంఘటన స్థలం నుండి