తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని కరోనాతో మృతిచెందింది. ఏంబీబీఎస్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై ఏలూరు ఆశ్రమంలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఈ విద్యార్థినిని కరోనా కబళించడంతో గ్రామంలో విషాద ఛాయలు అముకున్నాయి. విద్యార్థిని చదివిన చోటే.. రోగులకు చికిత్స అందిస్తుండగా అనారోగ్యానికి గురైంది. స్వగ్రామం మోరి చేరుకుని స్థానిక సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో చేరింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆసుపత్రిలోనే కన్నుమూసింది.