గురు శిష్యుల బంధం ఎంతో పవిత్రమైనది. అలాంటి బంధానికి కొందరి వలన ఎంతో చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. ఓ మదర్సా ఉపాధ్యాయుడు యువతిపై చేసిన దారుణం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. గత నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన సదరు ఉపాధ్యాయుడి దారుణం ఎట్టకేలకు బయట పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మదర్సా టీచర్ యువతిపై నాలుగేళ్లుగా అత్యాచారం చేసి, గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలోని ఫీష్‌గడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. బాధిత యువతి చదువుకునేందుకు మదర్సాకు వెళ్తుండేది.
మదర్సాలో ఉపాధ్యాయుడు యువతిని తాను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా ఆమెపై అత్యాచారం చేశాడు. యువతి గర్భం దాల్చడంతో బలవంతంగా ఆమెకు గర్భస్రావం చేయించాడు. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి అడిగితే ఒకప్పుడు ఇంకాస్త టైమ్ తీసుకుందామని చెప్పేవాడు. ఇటీవలి కాలంలో మాత్రం చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన కీచక ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి సజ్వాన్ చెప్పారు. అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.