మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో సోషల్ మీడియా ద్వారా ప్రేమ వలలో పడిన బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడు తానొక బ్యాచిలర్ అని నటించి.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి కోసం బాధితురాలు ఒత్తిడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాచిలర్ అని నమ్మించిన సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లి అయిందని తేలింది. దీంతో ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్వాలియర్‌లోని డోంగర్‌పూర్‌లో నివసిస్తున్న 25 ఏళ్ల యువతి.. సోషల్ మీడియా ద్వారా సోను పాల్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పింది. ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారిందని పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో పడ్డారు. అతడేమో తాను బ్యాచిలర్ అని చెప్పుకున్నాడు. ఆ అమ్మాయిని ప్రేమ వలలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో తనకు అప్పటికే పెళ్లి అయినట్లు వెల్లడించాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు.