పెళ్లి చేసుకోమ‌ని అడిగింది.. హత్య చేసి ఎనిమిది నెలలు ఫ్రిడ్జ్‌లో దాచాడు..!

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఎనిమిది నెలల పాటు ఫ్రిజ్‌లో ఉంచాడు.

By Medi Samrat  Published on  11 Jan 2025 5:30 PM IST
పెళ్లి చేసుకోమ‌ని అడిగింది.. హత్య చేసి ఎనిమిది నెలలు ఫ్రిడ్జ్‌లో దాచాడు..!

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఎనిమిది నెలల పాటు ఫ్రిజ్‌లో ఉంచాడు. అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లి అయింది. నిందితుడు సంజయ్ పాటిదార్ అద్దెకు తీసుకున్న ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో నగలు, మెడకు ఉచ్చుతో పాటు చేతులు కట్టేసి ఉంచిన మహిళ కుళ్ళిపోయిన మృతదేహం లభ్యమైంది.

బాధితురాలు పింకీ ప్రజాపతిని గతేడాది జూన్‌లో హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉజ్జయిని నివాసి అయిన సంజయ్ పాటిదార్ గత ఐదేళ్లుగా ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని ఆమె అతనిపై ఒత్తిడి చేస్తోందని, దాని వల్లే పాటిదార్ తన స్నేహితుడి సాయంతో ఆమెను చంపేశాడని పోలీసులు చెబుతున్నారు.

"మహిళకు 30 ఏళ్లు ఉంటాయి. జూన్ 2024లో ఆమె హత్యకు గురైందని అనుమానిస్తున్నాము. ఇటీవల దుర్వాసన రావడంతో, ఇరుగుపొరుగు వారు ఇంటి యజమానిని పిలిచారు. వెళ్లి చూడగా మహిళ మృతదేహం రిఫ్రిజిరేటర్‌లో కనుగొన్నారు ”అని దేవాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పునీత్ గెహ్లాట్ తెలిపారు. ఈ ఇల్లు ఇండోర్‌లో నివసిస్తున్న ధీరేంద్ర శ్రీవాస్తవకు చెందినదని, శ్రీవాస్తవ ఆ ఇంటిని జూన్ 2023లో పాటిదార్‌కు అద్దెకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Next Story