ఆమెకు 17 లక్షల రూపాయలు చెల్లించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. తీరా చూస్తే..

Man who brought bride after paying Rs 17 lakh. పెళ్లి పేరుతో యువతి యువకులను మోసం చేసిన ఉదంతం రాజస్థాన్‌లోని జలోర్ జిల్

By Medi Samrat  Published on  3 Feb 2022 2:10 PM IST
ఆమెకు 17 లక్షల రూపాయలు చెల్లించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. తీరా చూస్తే..

పెళ్లి పేరుతో యువతి యువకులను మోసం చేసిన ఉదంతం రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా బగోరా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఓ యువకుడు రూ.17 లక్షలు చెల్లించి 23 ఏళ్ల వధువును పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. 15 రోజుల తర్వాత ఆ పెళ్లికూతురు కాస్తా ఇంటి నుంచి పారిపోయింది. పెళ్లి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బగోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూని బాలి నివాసి హరి సింగ్, ఫిబ్రవరి 2021 లో వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. పెళ్లికి బదులుగా ఒక బ్రోకర్ అతని నుండి రూ. 17 లక్షలు తీసుకున్నాడు. పెళ్లయిన 15 రోజుల తర్వాత వధువు పీహార్‌కు వెళ్లిన వధువు తిరిగి రాలేదు.

ఆమె మోసం చేసినట్లు గుర్తించాడు పెళ్లి కొడుకు. యువకుడి ఫిర్యాదు మేరకు బాగోర పోలీస్ స్టేషన్‌లో మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు కేసు నమోదైంది. జలోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ అగర్వాలా ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌ఓ శత్రు సింగ్ నేతృత్వంలో బృందాలు ఏర్పాటయ్యాయి. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ప్రధాన నిందితురాలు ఇందూ భాయ్‌ను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పోలీసు రిమాండ్‌కు అప్పగించింది. ఆమె పలువురు యువకులను ఇదే విధంగా మోసం చేసినట్లు తెలుస్తోంది.


Next Story