27 ఏళ్ల‌ తర్వాత ప‌ట్టుబ‌డ్డ‌ రేప్ కేసు నిందితుడు

Man wanted in rape case held after 27 years in UP's Saharanpur. మహిళపై అత్యాచారానికి పాల్పడి 27 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని

By Medi Samrat  Published on  25 May 2022 6:54 PM IST
27 ఏళ్ల‌ తర్వాత ప‌ట్టుబ‌డ్డ‌ రేప్ కేసు నిందితుడు

మహిళపై అత్యాచారానికి పాల్పడి 27 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు ఇందర్ బహదూర్ థాపా, 1988లో మిర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై అత్యాచారం చేసినందుకు అరెస్టయ్యాడు. 1995లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పెరోల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని సోమవారం రాత్రి 8.30 గంటలకు బాద్షాహీ బాగ్ తేకే ప్రాంతంలో పట్టుకున్నారు. ఆ తర్వాత జైలుకు పంపారు. నిందితుడు సహరాన్‌పూర్‌లోని బాద్‌షాహీ బాగ్ కాలనీ నివాసి అని, రిషికేష్‌లోని కృష్ణానగర్ కాలనీలో తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. 27 సంవత్సరాల తర్వాత పట్టుబడడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.









Next Story