గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో మాట్లాడుతున్న భార్య.. తండ్రితో క‌లిసి భ‌ర్త ఏం చేశాడంటే..

Man takes help from father to murder wife’s lover. తండ్రి సహాయంతో భార్య ప్రియుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌కు

By Medi Samrat  Published on  21 Nov 2021 3:17 PM IST
గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో మాట్లాడుతున్న భార్య.. తండ్రితో క‌లిసి భ‌ర్త ఏం చేశాడంటే..

తండ్రి సహాయంతో భార్య ప్రియుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఆ వ్య‌క్తికి ఈ ఏడాది మే నెల‌లో వివాహం అయ్యింది. హ‌త్య‌కు పాల్ప‌డ్డ తండ్రీ, కొడుకుల‌ను పోలీసులు అరెస్టు చేయ‌గా.. విచార‌ణ‌లో ఆస‌క్తిక‌ర వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ మేర‌కు ఇమాలియా సుల్తాన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ రాజేష్ సింగ్ వివ‌రాలు వెల్ల‌డించారు. నిందితుడు తన భార్య ఎవరితోనో గంట‌లు గంట‌లు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. రోజులో చాలా గంటలు ఇంటి బయటే ఉండేది.. దీంతో ఆమెపై అనుమానం రాగా.. ఓ క‌న్నేసి ఉంచాడు.

అయితే.. ఓ రోజు మోహిత్ అనే వ్యక్తితో కలిసి ఉన్న‌ భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు నిందితుడు. అయితే.. ఈ విషయాన్ని అత‌ను అంత‌గా పట్టించుకోలేదు. విష‌యం కాస్తా ఆ నోటా ఈ నోటా.. బంధువులు, గ్రామస్థులకు తెలిసింది. దీంతో భార్య‌పై కోపంతో ఊగిపోయిన భ‌ర్త.. ఈ విష‌యం తన తండ్రితో చర్చించాడు. తండ్రీ, కొడుకులు ఇద్ద‌రు క‌లిసి మోహిత్‌ను అంత‌మొందించాల‌ని నిర్ణయించుకున్నారు.

ప‌థ‌కం ప్ర‌కారం.. నిందితులిద్దరూ బుధవారం గోలాపూర్-సీతాపూర్ మలుపు వద్దకు మోహిత్‌ను మాట్లాడేందుకు పిలిచి పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు. దొరికిపోతామనే భయంతో.. ఇద్దరూ మోహిత్‌ మృతదేహాన్ని తమ మోటార్‌సైకిల్‌కు కట్టి.. బైక్‌ను చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంలా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. మోహిత్‌ పోస్ట్‌మార్టం రిపోర్టులో అది హత్యగా తేలింది. దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.


Next Story