మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతుంది. తమ్ముడు వయస్సు ఉన్న బాలుడిపై ఓ యువకుడు కర్కషంగా ప్రవర్తించాడు. బాలుడిని కండోమ్ తీసుకురావాలని ఒత్తిడికి గురిచేశాడు. అందుకు బాలుడు నిరాకరించడంతో అతనిపై కత్తితో దాడి చేశాడు. వివరాళ్లోకివెళ్లితే.. పుణెకి చెందిన నీలేశ్ (21) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడి దగ్గరకు వెళ్లి దగ్గరలోని ఓ మెడికల్ షాపుకు వెళ్లి కండోమ్ ప్యాకెట్ తీసుకురమ్మని బెదరించాడు.
అందుకు బాలుడు నిరాకరించడంతో.. నీలేశ్ బాలుడిని దూషిస్తూ.. కొట్టడం మొదలెట్టాడు. అంతేకాదు.. విఛక్షణ కోల్పోయి కత్తితో బాలుడి మెడపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. నీలేశ్ సమీపంలో ఉన్న కారు నుంచి కత్తి తీసి దాడి చేశారని పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడి కుటుంబసభ్యులు పుణెలోని చందానగర్ ఠాణాలో నిలేశ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.