గొడవను ఆపేందుకు వెళ్లి 22 కత్తిపోట్లు!

Man stabbed to death, 2 others injured in brawl with another group over job in Delhi. స్నేహితులపై జరుగుతున్న దాడిని

By Medi Samrat
Published on : 12 Dec 2020 6:54 PM IST

గొడవను ఆపేందుకు వెళ్లి 22 కత్తిపోట్లు!

స్నేహితులపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖేశ్, రాకేశ్ అనే వ్యక్తులు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో కృష్ణన్, రవి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. వారిద్దరినీ తొలగించిన ఆసుపత్రి యాజమాన్యం రాకేశ్, ముఖేశ్ లను నియమించుకుంది. తమ ఉద్యోగాలను లాగేసుకున్నారని కృష్ణన్, రవిలు ముఖేశ్, రాకేశ్ లపై కక్ష పెంచుకున్నారు.

బుధవారం రాత్రి ముఖేశ్, రాకేశ్ తమ విధులు ముగించుకుని తమ మిత్రుడు నీరజ్ తో కలిసి ఇంటికి వెళుతున్నారు. దారి మధ్యలో కాపుకాసిన కృష్ణన్, రవి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఆపి ఘర్షణకు దిగారు. గొడవను ఆపాలని నీరజ్ జోక్యం చేసుకున్నాడు. అంతే తీవ్ర కోపోద్రిక్తులైన కృష్ణన్, రవి కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నీరజ్ కు 22 కత్తిపోట్లు అయ్యాయి. తీవ్రరక్తస్రావంతో అతడు మరణించాడు. రాకేశ్, ముఖేశ్ కూడా తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడిలో కృష్ణన్, రవిలతో పాటు ఓ మైనర్ బాలుడు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణన్, రవి, మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గొడవతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాపం నీరజ్ అంటూ పలువురు అతడి విషయంలో జరిగిన దాడిని తలుచుకుని బాధను వ్యక్తం చేస్తున్నారు.


Next Story