భీమ్లా నాయక్ టిక్కెట్ల విషయంలో ఘర్షణ.. క‌త్తితో గొంతుపై దాడి చేయ‌డంతో..

Man slits youth throat after clash over Bheemla Nayak movie tickets in Kothagudem. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భీమ్లా నాయక్ సినిమా టిక్కెట్ల విషయంలో

By Medi Samrat  Published on  25 Feb 2022 3:05 PM GMT
భీమ్లా నాయక్ టిక్కెట్ల విషయంలో ఘర్షణ.. క‌త్తితో గొంతుపై దాడి చేయ‌డంతో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భీమ్లా నాయక్ సినిమా టిక్కెట్ల విషయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. కొత్తగూడెంకు చెందిన మధు అనే యువకుడు మ్యాట్నీ షో సందర్భంగా సినిమా టిక్కెట్ల విషయంలో వేణుగోపాల్ థియేటర్ వద్ద జయమ్మ కాలనీకి చెందిన షరీఫ్‌తో గొడవ పడ్డాడు. ఆవేశంతో షరీఫ్.. మధు గొంతు కోసి, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని కొట్టడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది.

తీవ్ర రక్తస్రావంతో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అత‌డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పవన్ కళ్యాణ్ న‌టించిన‌ భీమ్లా నాయక్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యా మీనన్, రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Next Story