ఒంట‌రి మ‌హిళ‌పై క‌న్నేశాడు.. మత్తుమందుతో ఇంటికెళ్లి తలుపు తట్టాడు..

Man Sexually Abused Woman In Shamshabad. శంషాబాద్ లో అత్యాచార ఘటన కలకలం రేపింది. మత్తు మందు ఇచ్చి

By Medi Samrat  Published on  25 July 2022 5:01 PM IST
ఒంట‌రి మ‌హిళ‌పై క‌న్నేశాడు.. మత్తుమందుతో ఇంటికెళ్లి తలుపు తట్టాడు..

శంషాబాద్ లో అత్యాచార ఘటన కలకలం రేపింది. మత్తు మందు ఇచ్చి వివాహితపై ఓ ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు బెదిరింపులకు దిగాడు. ఆమె నగ్న చిత్రాలను ఆమెకే పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. ముడావత్ చందూలాల్ (40) శంషాబాద్ ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోవడంతో ఓ మహిళ ఉపాధికోసం శంషాబాద్ కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది.

ఆమెపై చందూలాల్ కన్నేశాడు. కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. హ్యాండ్ కర్చీఫ్ లో మత్తుమందు పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపులు తీయగానే ఆ కర్చీఫ్ ను ఆమె ముక్కు మీద పెట్టాడంతో ఆ మహిళ సృహ కోల్పోయింది. ఆ తరువాత మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలను ఫోన్ లో చిత్రీకరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మహిళ నగ్న చిత్రాలను ఆమె ఫోన్ కి పంపించి బెదిరించడం మొదలుపెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











Next Story