40 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు.. ఆ తర్వాత..
Man Rapes 40 Years Woman With His Friends. ముక్కూ మొఖం తెలియని వ్యక్తులతో ఫోన్ కాల్స్ లో పరిచయం అయ్యాడనో.. సోషల్ మీడియా
By Medi Samrat Published on 4 Oct 2021 10:34 AM IST
ముక్కూ మొఖం తెలియని వ్యక్తులతో ఫోన్ కాల్స్ లో పరిచయం అయ్యాడనో.. సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు కలిశాయనో చాలా దగ్గర అవుతూ ఉంటాం. అయితే అవతలి వాళ్లు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలియకుండా కొన్ని కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు జీవితంలో పెను మార్పులకు కారణం అవుతాయి. జైపూర్‌కు చెందిన రాంనారాయణ్ అనే వ్యక్తి మనసులోని కుతంత్రాన్ని.. ఓ మహిళ గమనించలేకపోయింది. అతడు చెప్పిన మాటలను నమ్మిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాంనారాయణ్ 40 ఏళ్ల మహిళతో మొదట పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు తరచూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేవారు. చాలా కాలం వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఈ క్రమంలోనే అతడు ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సహజీవనం చేయమని కోరాడు. ఆమెను చాలా ఒత్తిడి చేయడంతో ఆమె అందుకు ఒప్పుకొంది. ఇటీవల రాంనారాయణ్ కల్వద్‌లో ఉన్న తన ఇంటికి ఆ మహిళను తీసుకుని వెళ్లాడు. అయితే అక్కడ జరగబోయే దారుణాన్ని సదరు మహిళ ఊహించలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత అతని స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని పిలిచాడు.
అక్కడికి వారందరూ రాగానే కలిసి మద్యం సేవించారు. రాంనారాయణ్ మొదట ఆమెపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దాడిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. ఆమెను అక్కడే వదిలిపెట్టి నిందితుడు తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు. దీంతో సదరు మహిళ రాంనారాయణ్ తనను నమ్మించి మోసం చేశాడని.. తనపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని కల్వద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.