సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మైనర్ బాలికలపై అత్యాచారం

Man raped two teenage girls in the name of getting work in the film. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది

By Medi Samrat
Published on : 10 May 2022 8:15 PM IST

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మైనర్ బాలికలపై అత్యాచారం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ మైనర్ బాలికలను సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామనే సాకుతో అత్యాచారాన్ని పాల్పడ్డాడు. నిందితుడు వసాయ్ విరార్ ప్రాంతంలోని అడవికి తీసుకెళ్లి కట్టేసి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. మరిన్ని దారుణాలకు ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. గత ఏడాది కాలంలో నిందితుడు బాలికలను చాలాసార్లు అడవికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మీరా భయందర్-వసాయి విరార్ పోలీస్ కంట్రోల్ రూమ్ మంగళవారం ఈ విషయాన్ని నివేదించింది.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. బాధిత బాలికల అభ్యంతరకర చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి వారి నుంచి రూ.70,000 డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఈ విషయం బాలిక కుటుంబీకుల దృష్టికి వచ్చింది. దీంతో సోమవారం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని ఇంకా పోలీసులు అదుపులో తీసుకోవాల్సి ఉంది. అతనిపై ఐపీసీ సెక్షన్లు 376, 377, 384, 506, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.










Next Story