యువకుడిపై మరో యువకుడు అత్యాచారం.. 12 రోజులు గడవక ముందే..!
Man raped by another man in karnataka. కామంతో కళ్లుమూసుకున్న కొందరు.. అత్యాచారాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. జెండర్‌తో పని లేకుండా అత్యాచారాలకు
By అంజి Published on 17 Oct 2021 2:58 PM ISTకామంతో కళ్లుమూసుకున్న కొందరు.. అత్యాచారాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. జెండర్‌తో పని లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు జిల్లాలో ఓ యువకుడిపై మరో యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కబాక గ్రామంలో ఓ 20 ఏళ్ల యువకుడు సాయంత్రం సమయంలో వాకింగ్‌కు బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటి చేరుకున్న సమయంలో ఆ యువకుడికి బురద అంటి ఉండటాన్ని తండ్రి గమనించి కంగారుపడ్డాడు. ఏం జరిగిందని కొడుకును ఆరా తీయగా.. ఆ యువకుడు భయంతో వణుకుతూ జరిగిన విషయాన్ని చెప్పాడు. వాకింగ్‌కు వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరలో యువకుడిని నిందితుడు హనీఫ్ పలకరించాడు. నిందితుడు మహ్మద్ హనీప్‌తో బాధిత యువకుడికి ఇది వరకే పరిచయం ఉంది. దీంతో ఆ యువకుడు మాట కలిపాడు. చెరుకు రసం తాగిస్తానంటూ.. యువకుడిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇదే జిల్లాలో ఓ యువతిపై ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.
బెల్గాం జిల్లాలో ఓ హోటల్ హెల్పర్‌పై యువకుడు అత్యాచారం
ఇటీవల బెల్గాం జిల్లా పరిధిలో ఓ యువకుడిపై మరో యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సంకొనట్టి గ్రామంలోని తన సొదరి ఇంట్లో ఉంటూ యువకుడు దగ్గర్లోని ఓ హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. రోజు వారీగానే పనులు ముగించుకుని బస్సు కోసం వెయిట్ చేస్తుండగా.. అదే గ్రామానికి మరో యువకుడు బైక్‌పై వెళ్తూ అతనిని చూసి ఆగాడు. అక్క పిల్చుకురమ్మందంటూ బైక్ మీద ఆ యువకుడిని తీసుకెళ్లాడు. ఊరి శివారులోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తానని యువకుడు బెదిరించాడు. దీంతో బాధిత యువకుడు పోలీసులను ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.