డ్యాన్సర్ పక్కన ఉందని తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత..

Man opened fire with illegal weapon during marriage. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వివాహ వేడుకలో

By Medi Samrat  Published on  6 Dec 2021 9:53 AM IST
డ్యాన్సర్ పక్కన ఉందని తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వివాహ వేడుకలో ఒక వ్యక్తి డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు లైసెన్స్ లేని తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి తనను తాను హీరోగా భావించాడు. కానీ వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 28న గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విందు అనంతరం ఆ వ్యక్తి డ్యాన్స్ సమయంలో కాల్పులు జరిపాడు. ఉడ్కి మహ్మద్ గ్రామం సిక్రి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలో ఈ సంఘటన జరిగింది.

వివాహ వేడుకతో పాటు జరిగిన ఓ కార్యక్రమానికి మహిళా డ్యాన్సర్‌ని పిలిపించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో జావేద్ అనే గ్రామస్థుడు అక్రమంగా దాచుకున్న తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో, కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వైరల్ ఫుటేజ్ ప్రకారం, ఒక మహిళ అతని ముందు నృత్యం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేతితో తుపాకీని పట్టుకుని గాలిలోకి కాల్చాడు. చాలా మంది వ్యక్తులు సంఘటనా స్థలంలో ఉన్నారు. కొందరు ఆ సంఘటనను రికార్డ్ చేస్తున్నారు. డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తుండగా.. పదే పదే గాల్లోకి కాల్పులు జరిపాడు. అతడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గన్ ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు.


Next Story