తల్లి కోసం వెతుకుతున్న కొడుకులకు షాక్‌.. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి..

man murders wife by banging her head against wall. భార్యపై అనుమానంతో భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని 46 సంవత్సరాల

By Medi Samrat  Published on  24 Dec 2021 11:46 AM IST
తల్లి కోసం వెతుకుతున్న కొడుకులకు షాక్‌.. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి..

భార్యపై అనుమానంతో భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని 46 సంవత్సరాల వ్యక్తిగా గుర్తించాడు. అతను తన భార్య తలను గోడకు బాది.. బాది హత్య చేశాడు. మృతదేహాన్ని టెలివిజన్ టేబుల్ కింద దాచిపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని ఒట్టేరి ప్రాంతంలో చోటుచేసుకుంది. దంపతుల ఇద్దరు కుమారులు వారి తల్లి కోసం వెతకడం ప్రారంభించిన తర్వాత టేబుల్ కింద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలిని ఆర్‌ వాణి (41)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఎన్‌ రమేష్‌ (46)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని.. నిందితుడైన భర్త తన భార్యను అనుమానిస్తూ ఉండేవాడు.

సోమవారం రాత్రి పెద్ద కొడుకు తల్లి గురించి ఆరా తీయడంతో రమేష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తన తల్లి తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిందని, తిరిగి రావడం లేదని రమేష్ కూడా కొడుక్కు చెప్పాడు. పిల్లలు తమ తల్లి కోసం వెతకడం కొనసాగించారు, ఆమె వెళ్ళే ప్రదేశాలను వెతికి మంగళవారం రాత్రి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమనించారు. వారు వెంటనే వాసన ఎక్కడ నుండి వస్తోందోనని చూడగా.. టెలివిజన్ టేబుల్ క్రింద బట్టలలో తల్లి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఒట్టేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ప్రాథమిక విచారణలో, మహిళ తలపై ఒక గాయం గుర్తు మాత్రమే ఉందని, ఇతర గాయాలు ఏవీ లేవని పోలీసులు గమనించారు. సోమవారం జరిగిన గొడవ తర్వాత రమేష్ తన భార్య తలపై కొట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.


Next Story