స్నానం చేశాక టవల్‌ అడిగితే భార్య ఇవ్వలేదన్న కారణంతో దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బాలాఘాట్‌ జిల్లాలోని కిరణ్‌పూర్‌ పీఎస్‌ పరిధిలోని హీరాపూర్‌ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్‌ బాహే, పుష్పా భాయ్‌లు దంపతులు. భర్త రాజ్‌ కుమార్‌ బాహే (50) ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు భర్త స్నానం చేసిన తర్వాత భార్యను కొట్టాడు. టవల్‌ ఇవ్వాలని భార్యను అడిగాడు. అదే సమయంలో భార్య పుష్పా భాయ్‌ కిచెన్‌ రూమ్‌లో గిన్నెలు కడుగుతోంది. కాసేపయ్యాక టవల్‌ ఇస్తానని చెప్పడంతో ఆవేశంతో భర్త రాజ్‌కుమార్‌ భార్యను షావెల్‌ చితకబాది చంపేశాడు. తల్లిని కొడుతుండగా కూతురు అడ్డుకుంది. దీంతో కూతురిని బెదిరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టు మార్టం చేశారు.

నిందితుడు రాజ్‌కుమార్ బహే (50) స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా చెప్పారు. వంట పాత్రలు కడుక్కుంటున్న భార్య అతడిని కొంతసేపు ఆగమని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్య తలపై పారతో పదే పదే కొట్టాడని అధికారి తెలిపారు. మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని, నిందితుడు తన 23 ఏళ్ల కుమార్తెను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు బెదిరించాడని అతను చెప్పాడు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని, అతనిపై హత్య ఇతర సంబంధిత నిబంధనలపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story