బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చి చంపిన ఓ వ్యక్తి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. 3, 4 ప్లాట్‌ఫారమ్‌లను కలిపే ఫుట్‌బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించారు. "అరా రైల్వే స్టేషన్‌లోని 3, 4 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఉన్న ఓవర్‌బ్రిడ్జిపై, తుపాకీ గాయాలతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రత్యక్ష సాక్షి ప్రకారం, 23-24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి 16-17 సంవత్సరాల వయస్సు గల బాలికను, ఆమె తండ్రిని కాల్చాడు. తరువాత అతను తనను తాను కాల్చుకున్నాడు.. తగిన దర్యాప్తు తర్వాత జరుగుతుంది" అని సీనియర్ పోలీసు అధికారి పరిచయ్ కుమార్ తెలిపారు. ముగ్గురూ ఘటనా స్థలంలోనే చనిపోయారని పోలీసులు ధృవీకరించారు.
కాల్పుల వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, ప్రేమ కోణాన్ని తోసిపుచ్చలేమని పోలీసులు తెలిపారని వార్తా సంస్థ PTI నివేదించింది. పోలీసులు ఈ హత్యల గురించి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుండి ఆధారాలు సేకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆ అమ్మాయి ఢిల్లీకి వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చింది.