భార్యను చంపి ఆరేళ్లు జైల్లో ఉన్నాడు.. బెయిల్ ఇప్పించిన సోదరిని కూడా..

Man kills sister In Maharastra. మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సోదరిని

By Medi Samrat  Published on  6 Dec 2021 4:54 AM GMT
భార్యను చంపి ఆరేళ్లు జైల్లో ఉన్నాడు.. బెయిల్ ఇప్పించిన సోదరిని కూడా..

మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా హత్య చేశాడు. థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సేకరించిన సమాచారం ప్రకారం తన సోదరిని హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ శవాన్ని కొన్ని రోజులు ఇంటి లోపల దాచిపెట్టాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం 45 ఏళ్ల యోగేష్ తన సోదరి అరుణతో ఇటీవల వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం చివరికి తన సోదరిని చంపేంత వ‌ర‌కూ వెళ్ళింది.

అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఆరేళ్ల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన యోగేష్‌కు అతని సోదరే బెయిల్ మంజూరు చేయించినట్లు అధికారులు తెలిపారు. అరుణను పదునైన ఆయుధంతో యోగేష్ హత్య చేశాడని తెలుస్తోంది. కొన్ని రోజుల ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు, కానీ గదిలో దుర్వాసన రావడంతో, అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి బాగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారిస్తున్నారు.


Next Story
Share it