మహబూబ్‌నగర్‌లోని యెనుగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తండ్రిని రక్షించడానికి ప్రయత్నించి కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. 46 ఏళ్ల వ్యక్తి ట్రైన్ కు ఎదురుగుగా వెళ్లి ప్రాణాలు తీసుకోవాలని భావించగా.. అతడి కుమార్తె కాపాడడానికి వెళ్లగా ఆమె ప్రాణాలు కూడా పోయాయి. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రాణాలు కోల్పోయిన వారిని స్థానిక ఎస్‌విఎస్ ఆసుపత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శివానంద్.. మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 17 ఏళ్ల చందనగా గుర్తించారు. కుటుంబ సమస్యలపై వారి నివాసంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. శివానంద్ ఇకపై బతకడానికి ఇష్టం లేదని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. చందన అతని కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ, అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శివానంద్ నేరుగా సమీపంలోని రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. అతని కుమార్తె చందన అతనిని రక్షించడానికి ప్రయత్నించింది. అయితే ఊహించని విధంగా ఇద్దరూ రైలు ఢీకొని సంఘటనా స్థలంలో మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు.