ఐటీ ఉద్యోగిని వేధించిన వ్య‌క్తి అరెస్ట్‌

ఒక ఐటీ ఉద్యోగిని, అతని మహిళా సహోద్యోగిని బహిరంగ ప్రదేశంలో వారి అనుమతి లేకుండా చిత్రీకరించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేసి వేధించిన 24 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 2 Aug 2025 8:45 PM IST

ఐటీ ఉద్యోగిని వేధించిన వ్య‌క్తి అరెస్ట్‌

ఒక ఐటీ ఉద్యోగిని, అతని మహిళా సహోద్యోగిని బహిరంగ ప్రదేశంలో వారి అనుమతి లేకుండా చిత్రీకరించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేసి వేధించిన 24 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జూలై 29న ఎన్టీఆర్ మార్గ్‌లో బాధితులు ఇంటికి వెళుతుండగా, రైడ్-హెయిలింగ్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు తన ద్విచక్ర వాహనంపై వారి వద్దకు వచ్చాడు. నిందితుడు ఇద్దరినీ తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. హిజాబ్ ధరించి వేరే మతానికి చెందిన వ్యక్తితో ఉన్నందుకు మహిళను ప్రశ్నించాడు. అతను అసభ్యకరమైన భాషను ఉపయోగించాడు, వారిని బెదిరించాడు. ఇద్దరి మీద దాడి చేశాడు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) కె శిల్పవల్లి తెలిపారు. వారు భయంతో తమ బైక్‌పై పారిపోతుండగా, నిందితుడు హిమాయత్ నగర్ ప్రాంతానికి చేరుకునే వరకు తన సెల్ ఫోన్‌తో వీడియో తీసి వారిని వెంబడించాడని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Next Story